అశ్లీల OTT లను నిషేధించడం అభినందనీయం

కేవలం డబ్బులకోసం కక్కుర్తి పడి అశ్లీలకర , అసభ్యకర కంటెంట్ ను ప్రచారం చేస్తూ
సమాజాన్ని ముఖ్యంగా యువతరాన్ని చెడ గొడుతున్న
18 OTT ప్లాట్ ఫామ్ లను , వాటికి అనుబoదంగా పనిచేస్తున్న 19 వెబ్ సైట్ లను , 10 యాప్ లను , 57 సోషల్ మీడియా ఖాతాలను
నిషేదిస్తున్నట్లు ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం
అభినందనీయం ” ….అని సినీ దర్శకుడు ,ప్రజా నాట్యమండలి
వర్కింగ్ ప్రెసిడెంట్ బాబ్జీ పేర్కొన్నారు…..!

కళలు , సాంస్కృతిక కళారూపాలు ప్రజలను చైతన్య పరిచే విధంగా ఉండాలి , సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి ,
దిక్సూచిలా ఉండాలి తప్ప
చెడ గొట్టెలా ఉండకూడదు ,
రేపిస్టులుగా , మతోన్మాదులు గా , నేరస్తులుగా మార్చేలా ఉండకూడదు ….” అని ఆయన
ఉద్ఘాటించారు….!

ఇకనుంచి సినిమాలకు ఎంత కఠినంగా సెన్సార్ చేస్తున్నారో
అంతే కఠినంగా OTT ప్లాట్ ఫామ్ లనుంచి , TV ల నుంచి
వచ్చే అన్ని సినిమాలను , వెబ్
సీరీస్ లను , సీరియల్ లను ఖచ్చితంగా సెన్సార్ చేయాలి అనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం కఠినంగా అమలుచేయాలి , సెన్సార్ సభ్యులుగా రాజకీయ నాయకులు రికమెండ్ చేసిన
వ్యక్తులను కాకుండా సామాజిక
కార్యకర్తలను , ప్రజోధ్య మాలలో అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళను , కళల పట్ల సాహిత్యం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులను
నియమించాలి ” అని బాబ్జీ డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest