ఎన్టీఆర్ ను పరిచయం చేస్తున్నా: వైవిఎస్ చౌదరి

దివంగత నందమూరి తారక రామారావు గారి ముని మనవడి పేరు NTR. అంటే హరికృష్ణ గారి కొడుకు జానకిరామ్ …ఇతను జానకి రామ్ కుమారుడు ..NTRను హీరోగా పరిచయం చెయ్యడం నేను అదృష్టంగా భావిస్తున్న. నన్ను మానవత్వంతో చూసే హరికృష్ణ గారి జేష్ఠ కుమారుడైన జానకిరామ్ , నందమూరు దీపికల కుమారుడు నందమూరి తారకరామారావు . ఆయన పుట్టినప్పుడే ఎన్టీఆర్ అని పేరు పెట్టారు. కొడుకుని హీరో చెయ్యాలని జానకిరామ్ కళలు కన్నాడు కానీ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. నేను హీరోల కోసం వెతుకుతున్న సమయంలో తుమ్మల ప్రసన్న కుమార్ జానకిరామ్ కొడుకుని పరిచయం చేశాడు. నాకు నచ్చితేనే చేస్తా. అతను ఎంత పెద్ద వాడైనా నాకు నచ్చకపోతే చెయ్యను. గీతను నిర్మతగా చేస్తూ ఎన్టీఆర్ పేరు వచ్చేలా బ్యానర్ పేరును కూడా పెట్టాం. ఎన్టీఆర్ అంటే న్యూ టాలెంట్ రోర్ అని పెట్టాం ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా ప్రకటన కోసం సోమవారం ప్రెస్ మీట్ పెట్టారు. మరో ప్రెస్ మీట్ లో నందమూరి తారకరామారావును చూపిస్తా అని దర్శకుడు వై వి ఎస్ చౌదరి చెప్పారు. వైవిఎస్ చౌదరి భార్య గీత కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అమెరికాలో ఉండే ఒకాయన నిర్మాతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల సందర్బంగా కేక్ కట్ చేశారు. తెలుగు నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest