ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న

 

హైదరాబాద్ : వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇద్దరూ ఎలిమినేషన్ కావడంతో తీన్మార్ మల్లన్న గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పేపర్ బ్యాలెట్ కావడంతో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులుగా సాగింది. అయితే ఇక్కడ బి ఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు చుక్కలు చూపించారు. ఈ సారి చాలా ఎక్కువ శాతం చెల్లని ఓట్లు పోలయినట్టు అధికారులు వెల్లడించారు. చాలా మంది పేపర్ బ్యాలెట్ పైన ఐ లవ్ యు మల్లన్న అని రాశారని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest