ఒక్క రోజులో ‘లవ్ మీ’కి 4.5 కోట్లు గ్రాస్

 

ఆశిష్, వైష్ణవి హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ మీ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆ సినిమా యూనిట్ పేర్కొంది. సినిమా రిలీజ్ అయినా ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ ఉందని హీరో ఆశిష్ చెప్పారు. తన తొలి సినిమాకే మంచి పేరు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బేబీ సినిమా తరువాత తన రెండో సినిమాకు కూడా సక్సెస్ టాక్ రావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞ్యతలు తెలిపారు. దిల్ రాజు కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడితో పాటు నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత పాల్గొన్నారు. అయితే ఈ సినిమా విడుదలైన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా 4.5 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest