కేంద్ర మంత్రి వర్గంలో ఏడుగురు మహిళలు

న్యూ ఢిల్లీ (09జూన్ 2024 )
కేంద్రంలో కొత్తగా కొలువు దీరిన 72 మంది మంత్రుల్లో 7గురు మహిళా మంత్రులకు బెర్త్ లభించింది. అయితే నిర్మల సీతారామన్ ఇప్పటికే రెండు సార్లు ఆర్థిక శాఖామంత్రిగా పని చేశారు. ఆమెకు మూడోసారి క్యాబినెట్ లో చోటు దక్కింది. కొందరు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో పదిమంది మహిళా మంత్రులు ఉన్నారు. కానీ ఈ సారి ముగ్గురు తగ్గించారు. . మొత్తానికి ఏడుగురికి మంత్రి పదవి కట్టబెట్టారు. నిర్మల సీతారామన్ రాజ్యసభ నుంచి మంత్రి అయ్యారు. ఆర్ జె డీ పార్టీకి చెందిన ఓబీసీ నేత అన్నపూర్ణ దేవి. ఈమె జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నాయకురాలు. ఆమె భర్త మరణానంతరం బీజేపీ మంత్రి వర్గంలో చేరింది. సావిత్రి ఠాకూర్ మధ్య ప్రదేశ్ కు చెందిన గిరిజన నాయకురాలు. ఈమె థార్ లోక్ సభ నుంచి విజయం సాధించారు. నిముబెన్ బాంబనియా గుజరాత్ బీజేపీ మహిళా నాయకురాలు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పైన నాలుగున్న లక్షల మెజారిటీతో ఈమె భావనగర్ లోక్ సభ నుంచి గెలిచారు. ఈమె గతంలో ఉపాధ్యాయురాలిగా, గుజరాత్ కు మేయర్ గా కూడా పని చేశారు. మహారాష్ట్ర నుంచి రక్షా ఖడ్సే ను సహాయ మంత్రిగా తీసుకున్నారు. బీజేపీ నేత ఎకనాథ్ ఖడ్సే కోడలు . రక్ష భర్త నిఖిల్ ఖడ్సే ఆత్మహత్య చేసుకున్నారు. శోభా కరంద్లాజే కర్ణాటక నుంచి మంత్రి పదవి పొందారు. బెంగళూరు నార్త్ లోక్ సభ నుంచి ఆమె గెలిచినారు. ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి ఎద్దురప్పకు దగ్గరి బంధువు. కూర్మి సామాజిక వర్గానికి చెందిన అనుప్రియ పటేల్ కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈమె అప్నా దళ్ పార్టీ అధినేతగా ఉన్నారు. అప్నా దళ్ వ్యవస్థాపకుడు డాక్టర్ సోనెయ్ లాల్ పటేల్ కుమార్తె అనుప్రియ పటేల్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest