కోట్లల్లో బోనస్ ఇచ్చిన చైనా కంపెనీ

బీజింగ్
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించే పని ఉంటె , చైనా కు చెందిన ఓ కంపెనీ మాత్రం ఏకంగా కోట్ల రూపాయలు తమ సిబ్బందికి బోనస్ గా అందజేసింది. ఆ డబ్బులను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా అంత పెద్ద మొత్తాన్ని స్వయంగా వారి చేతికి అందించింది. దీంతో ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. చైనాకు చెందిన హెనాన్ మెన్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కోట్ల రూపాయల బోనస్ ను ప్రకటించింది. కేవలం ప్రకటించడమే కాదు సదరు ఉద్యోగుల చేతికి ఆ డబ్బును అందించింది. హెనాన్ మెన్ అనే చైనా సంస్థ క్రెయిన్లను ఉత్పత్తి చేస్తుంది. కొరోనా సమయంలో ఈ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. దీంతో వచ్చిన లాభాల్లో కొంత శాతం ఉద్యోగులకు బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించారు. కంపెనీ సేల్స్ విభాగంలో మంచి పని తీరును కనబరచిన ముఫై మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్ యువాన్లు (సుమారు 73 కోట్లు) బోనస్ పరకటించింది. ఈ డబ్బును ఇవ్వడానికి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల డబ్బును వేదికపై పరిచారు. సేల్స్ రంగంలో అత్యుత్తమ పని తీరును కనబరచిన ముగ్గురిలో ఒక్కో ఉద్యోగికి సుమారు 6 కోట్ల రూపాయలు ఇచ్చింది. మిగిలిన సిబ్బందికి ఒక్కోక్కరికి 1. 20 కోట్ల రూపాయలను అందజేసింది. కంపెనీ కట్టలను సిబ్బంది బ్యాగుల్లో తీసుకుని వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest