గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ సర్వే

 

  • వెనకబడిన తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఆయుష్మాన్ భారత్ ఆన్‌లైన్ సర్వే వేగవంతం చేయడానికి ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు,ఎంపిడివొలు ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. అయినప్పటికీ ఈ సర్వేలో వెనకబడిపోవడం వల్ల రాష్ట్ర స్థాయి అధికారులు సీరియస్ అవుతున్నారు. అందుకునే ఇప్పుడు డివిజన్, జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి వాలంటీర్లు ద్వారా సర్వే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ సర్వేకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అలాగే కొందర గ్రామ వాలంటీర్లు తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా సర్వే వెనకబడి పోతుంది.మూడు నెలలుగా సర్వే చేస్తున్నప్పటికీ ఎందుకు పూర్తి అవ్వడం లేదని జిల్లాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 54 శాతం మాత్రమే సర్వే అవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కడియం తదితర మండలాల్లో ఈ సర్వే వెనకబడి ఉండగా ఉండ్రాజవరం, తాళ్లపూడి, నల్లజర్ల మండలాలు ముందున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత సీరియస్ అవ్వడంతో జిల్లా,డివిజన్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ సర్వేను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కడియం మండలం వేమగిరి సచివాలయం 1 పరిధిలో బుధవారం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రియాంక, రాజమహేంద్రవరం డివిజనల్ డెవలప్మెంట్ అధికారిణి వీణాదేవి లు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఎందుకు ఈ సర్వేలో జాప్యం జరుగుతుందని ఆరా తీశారు. సాంకేతిక సమస్య సాకుగా చూపించి సర్వే పై నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అలాగే గ్రామాల్లో పర్యటించి కొన్ని సర్వేలను స్వయంగా వారు పరిశీలించారు. రెండు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయడానికి వాలంటీర్లకు,సచివాలయ ఉద్యోగులకు తగిన బాధ్యతలు అప్పగించాలని గ్రామ కార్యదర్శి రాజశేఖర్ కు సూచించారు.

రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని జిల్లాలో కొందరు వాలంటీర్లు ఈ సర్వేపై శ్రద్ధ పెట్టడం లేదని ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని ఆదేశించారు. సర్వేలో వెనకబడిన వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ఎన్నో జీవితాలకు సంబంధించిన పథకమని దీనిపై నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని వివరించారు. కొందరు జీవనోపాధి కోసం ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిపోతారని అటువంటి వారికి ఉదయం, సాయంత్రం సమయాల్లో సర్వే పూర్తి చేయాలన్నారు.

సర్వే వేగవంతానికి చర్యలు

ఆయుష్మాన్ భారత్ సర్వే వేగవంతం చేయడానికి తగిన చర్యలు చేపడతున్మాము. నేషనల్ హెల్త్ అధారిటీ వారు తూర్పుగోదావరి జిల్లాలో 7,55,200 మందికి సర్వే చేయాలని పేర్లు ఇచ్చారు. ఇంకా 3.45 లక్షల మందికి సర్వే చేయాల్సి ఉంది. ఈ ఆయుష్మాన్ భారత్ పై అవగాహన లేక కొందరు సర్వేకు సహకరించడం లేదు. ఈ సర్వే ఆధారంగా వచ్చే కార్డుతో దేశం లో ఎక్కడికైనా వైద్యం పొందడానికి దోహదపడుతుంది.

డాక్టర్ ప్రియాంక
ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest