జగన్ మూసిన అన్నా క్యాంటిన్ మళ్ళీ ప్రారంభం-Anna Catine start agine

  • బాలకృష్ణ బర్త్ డే రోజు తిరిగి ప్రారంభం
  • అయిదేళ్ల తరువాత పేదలకు అన్నక్యాంటిన్ భోజనం అందుబాటులోకి

హిందూపూర్ :

ఆంధ్రప్రదేశ్ కు అన్న ఎన్టీఆర్ పేరు ఎంతో సుపరిచితం. ఆయన పేరిట ఏ కార్యక్రమం ప్రారంభించిన సక్సెస్ అని చెప్పాలి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటిన్ పెట్టి పేదలకు ఉచితంగా భోజనం పెట్ట్టాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అన్న క్యాంటిన్ లను మూసేశారు. ఆయన సర్కారు ఉన్న అయిదేళ్ల పాటు ఈ అన్న క్యాంటిన్లు మూసివేసి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జూన్ పదవ తేదీన స్వయంగా బాలకృష్ణ అన్న క్యాంటీలను ప్రారంభించారు. అక్కడికి వచ్చిన పేదలకు బాలకృష్ణ తన చేతులతో భోజనాలు వడ్డించారు. అంతేకాదు వృద్ధులకు ఆయనే తినిపించారు కూడా. దీంతో మళ్ళీ పేదలకు అన్న క్యాంటిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం లో అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest