తెలుగు తెరపై ఓ సంచలన సినిమాగా నమోదైన భారతీయుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 7న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కమల్ హాసన్ , మనీషా కొయిరాలా, ఊర్మిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కు ఎన్ . శంకర్ దర్శకుడు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి జనం ముందుకు వస్తోంది. దీనికి సంబంధిచిన తాజా ట్రైలర్ ను సోమవారం విడుదల చేయనున్నారు.
Post Views: 70