టీవీ 9 అఫీస్ లో రవి ప్రకాష్-ఎందుకెళ్ళాడు ?

హైదరాబాద్ :
టివి 9 కార్యాలయానికి ఆ ఛానెల్ మాజీ సీఈఓ రవి ప్రకాష్ వెళ్లారు. మంగళవారం ఆయన కారు దిగిన దగ్గరి నుంచి వీడియో తీశారు. టివి9 నుంచి రవి ప్రకాష్ ను తొలగించిన తరువాత ఆ కార్యాలయంలో అడుగు పెట్టడం ఇదే మొదటి సారి. రవి ప్రకాష్ తో పాటు పోలీసులు కూడా ఉన్నారు. పాత కేసుకు సంబధించి కొన్ని అంతర్గత విషయాలు చర్చించుకునేందుకు వచ్చారని ప్రచారం జరిగింది. ఆర్ టివి పేరుతో రవి ప్రకాష్ కొత్త ఛానెల్ ను ప్రారంభిస్తున్నారని ఇటీవల తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టివి 9 కార్యాలయంలో రవి ప్రకాష్ ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest