తెలంగాణ కాంగ్రెస్ లోకి తమ్మారెడ్డి భరద్వాజ ?

హైదరాబాద్ :
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, తమ్మారెడ్డి భరద్వాజ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి తమ్మారెడ్డి కమ్యూనిస్టు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు సంబంధించిన ఢిల్లీ పెద్దలు తమ్మారెడ్డి తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దత్తు తెలిపారు. భరద్వాజ తండ్రి తమ్మారెడ్డి కృష్ణ మూర్తి కమ్యూనిస్ట్య్ పార్టీ ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే భరద్వాజను తెలంగాణ కాంగ్రెస్ లోలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ్మారెడ్డి తో టచ్ లో ఉన్నటు తెలుస్తోంది.
నిజానికి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటుంది. కానీ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మద్రాసులో ఉన్న పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కీకంగా వ్యవహరించారు. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ లకు స్టూడియోలు కట్టుకోడానికి స్థలాలకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పిలుచుకుంటున్న ఆ స్థలం అంత కాంగ్రెస్ పార్టీ హయములోనే కేటాయించబడింది. కానీ తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రం కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశం కు మద్దత్తు తెలుపుతోంది. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ వ్యక్తిని కాంగ్రెస్ కు చేర్చుకోవడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest