అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో పవన్ కళ్యాణ్ ఇక భవిష్యత్తులో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పినట్టేనని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పాలనా పరమైన పనుల్లోనే ఆయన బిజీగా ఉంటారు కాబట్టి సినిమాలు చెయ్యడానికి సమయం దొరక్కపోవచ్చునని ఆయన సన్నిహితులు అంటున్నారు. హరిహర వీరమల్లుతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. ఓజీ (ఓజాస్ గంభీర) కూడా పూర్తి చెయ్యాల్సి ఉంది. మొత్తం మూడు సినిమాలు పూర్తి చెయ్యాల్సి ఉంది. హర హర వీరమల్లు -1 గత నాలుగేళ్ళ న్యూఇంచి పెండింగ్ లోనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ లు పూర్తి చేయడానికి సమయం దొరకలేదు. ఇప్పుడైతే హోమ్ మంత్రి హోదాలో సినిమాలు చెయ్యడానికి సమయం అసలే దొరకదని ఆయా సినిమాల నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సినిమాలు ఒప్పుకోకపోయినా , బ్యాలెన్స్ గా ఉన్న సినిమాలు పూర్తి చేస్తే సరిపోతుందని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.