భార్యపై బాల్ కొట్టి మీడియాకు సారి చెప్పిన కార్తికేయ

 

సినిమా ఈవెంట్ ఆర్గనైజర్లకు మెదడులో బుర్ర ఉండదు అంటారు. అది నిజమే కాబోలు. ఐ మాక్స్ థియేటర్ లో భజే వాయువేగం అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా హీరో కార్తికేయ ( RX 100) తో ఈవెంట్ ఆర్గనైజర్లు క్రికెట్ ఆడించారు. థియేటర్ లో ఎవరైనా క్రికెట్ ఆడిస్తారా? కానీ ఆడించారు… హీరో కూడా అదేదో ఉప్పల్ స్టేడియం అయినట్టు షార్ట్స్ కొట్టాడు. దర్శకుడు వేసిన బాల్ ను షాట్ కొడితే ఫస్ట్ బాల్ వెళ్లి హీరో వైఫ్, డైరెక్టర్ వైఫ్ కూర్చున్న చోట పడింది. ఈ విషయాన్నీ హీరోనే చెప్పాడు. ఇక రెండో బాల్ ముందర కూర్చున్న మీడియా మీద పడింది. నిజంగానే ఆ బాల్ అంత ఫోర్స్ గా వచ్చి ఏ మీడియా వ్యక్తికి తాకి ఉంటె దెబ్బ తగిలేది. తరువాత హీరో సింపుల్ గా సారి చెప్పేశాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest