మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం

న్యూ ఢిల్లీ (09జూన్ 2024) :
భారత ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధానితో పాటు ఇతర మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది సాహాయ మంత్రులు, 5గురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. వీరిలో 11 మంది విపక్ష పార్టీలు (ఎన్డీయే కూటమి) ఉన్నాయి. సామజిక వర్గాల వారీగా 23మంది ఒబీసీలు, 10 మంది ఎస్సిలు , 5గురు ఎస్టీలు, 5గురు మైనారిటీలు ఉన్నారు. ఏడుగురు మహిళలకు మోడీ మంత్రి వర్గంలో చోటు లభించింది.

మంత్రులు గా ప్రమాణస్వీకారం చేసింది వీళ్ళే
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ (ప్రధాని)
రాజ్ నాథ్ సింగ్
అమిత్ అనిల్ చంద్ర షా
నితిన్ జయరాం గడ్కరీ
జగత్ ప్రకాష్ నడ్డా
శివరాజ్ సింగ్ చౌహన్ (మధ్య ప్రదేశ్ మాజీ సీఎం)
నిర్మలాసీతారామన్ (మహిళా)
సుబ్రమణ్యం జయశంకర్
మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా మాజీ సీఎం)
కుమార్ స్వామి (కర్ణాటక మాజీ సీఎం )
జుయల్ ఓరం,(ఆరుసార్లు ఎంపీ)
సీఆర్ పాటిల్ (బిజేపీ గుజరాత్ చీఫ్)
జితిన్ ప్రసాద్, వీ.సోమన్న సహాయ మంత్రిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు.


మిత్రపక్షాల మంత్రులుగా

చిరాగ్ పాశ్వాన్ (ఎల్ జె పీ) -రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు
హెచ్‌డీ కుమారస్వామి, జేడీ(ఎస్‌)
జితన్‌ రామ్‌ మాంఝీ,(హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా )
రాజీవ్‌ రంజన్‌ అకా లలన్‌ సింగ్‌,(జేడీ(యూ)
కింజరాపు రామ్మోహన్ నాయుడు (తెలుగుదేశం)
వీరంతా కేంద్ర కేబినెట్ హోదా కలిగిన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

జితేంద్ర సింగ్,
రాందాస్ అథవాలే,( RPI)
నిత్యానంద రాయ్,
అర్జున్ రామ్ మేఘ్వాల్,
శ్రీపాద్ నాయక్,
రావ్ ఇంద్రజిత్ సింగ్,
క్రిషన్ పాల్ గుర్జార్ సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

బుల్దానా ఎంపీ ప్రతాప్‌రావు జాదవ్‌,
టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌,
ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి ,
అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest