రవితేజ-శ్రీలీల కాంబినేషన్ల లో కొత్త చిత్రం ప్రారంభం

మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా సితార ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. దేవుడి పటాలపై హీరోయిన్ శ్రీలీల క్లాప్ కొట్టారు. రవితేజకు ఇది 75వ చిత్రం. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని, రాబోయే సంక్రాంతికి ఈసినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వంశీ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు భాను భోగవరపు దర్శకుడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest