రాజ్యాంగం మారుస్తామన్న లల్లూ సింగ్ ను మట్టికరిపించిన SC ఎంపీ

అయోధ్య :
అది రాముని జన్మస్థలం అయోధ్య . ఈ మధ్యనే బాల రాముడి ఆయాలయాన్ని ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ అయోధ్య ప్రాంతంలోని ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ లల్లు సింగ్ అనే ఓ అగ్ర కులానికి నేతకు టికెట్ ఇచ్చింది. బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించిన వ్యక్తే లల్లూ సింగ్. కానీ ఇతనికి పోటీగా నిలబడ్డాడు ఓ షెడ్యూల్ కులానికి చెందిన నేత అవదేశ్ ప్రసాద్. ఏది ఎస్సి రిజర్వేషన్ సీట్ కూడా కాదు. జనరల్ సీట్ లో ఒక ఎస్సి సామజిక వర్గానికి చెందిన నేత పోటీపడి అగ్రకులానికి చెందిన లల్లూ సింగ్ ను ఓడించాడు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యక్తిని అసలు పార్లమెంట్ లో అడుగుపెట్టనివ్వకుండా చేసిన ఘనత అవదేశ్ ప్రసాద్ కె దక్కుతుంది. ఇలాంటి అతి తెలివి రాజకీయ నాయకులకు ఇలాగే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని ఇలాగే కాపాడవలసి ఉంటుంది. హాట్స్ సాఫ్ టూ సమాజ్ వాదీ పార్టీ , అవదేశ్ ప్రసాద్ . ఈ సందర్బంగా అవదేశ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది నా ఒక్కడి విజయం కాదు. ఇది ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాముని పేరు మీద వ్యాపారం చేస్తోందని ఆయన విమర్శించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest