రామోజీరావు ఇక లేరు

హైదరాబాద్ (08 జూన్ 2024)
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్ను మూశారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో రామోజీ ఫిలిం సిటీలోనే జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అకాల మరణంతో వ్యాపార వేత్తలు, రాజకీయ వేత్తలు, సినిమా ప్రముఖులు ప్రఘాడ సంతాపం తెలిపారు. ప్రియా పచ్చళ్ళ నుంచి మొదలు కొని ఈనాడు ప్రత్రికను స్థాపించి, అలాగే ఈటీవీను కూడా స్థాపించిన రామోజీరావు ప్రతి వ్యాపారంలోనూ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. దేశంలోనే గొప్ప ఫిలిం సిటీగా రామోజీ ఫిలిం సిటీని తీర్చి దిద్దారు. తెలుగు మీడియా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు ఆ తరువాత ఈటీవిని అన్ని భాషల్లోనూ విస్తరింపజేశారు. రామోజీరావు వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా మారింది. నందమూరి తారక రామారావుకు అత్యంత దగ్గరి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారిలో రామోజీరావు ఒకరని చెప్తారు. రామోజీరావు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించింది. వ్యాపార రంగంలోనే కాకుండా, సినిమా వ్యాపార రంగంలోకూడా తదైనా మార్క్ ను చూపించిన ఘనుడు రామోజీరావు. బడా వ్యాపారవేత్త అయినా రామోజీరావు అర్ధరాత్రి స్వతంత్ర, మౌనపోరాటం వంటి విప్లవాత్మక చిత్రాలను సైతం ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఆయన సేవలు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest