రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం-TDLP లీడర్ గా ఎన్నిక

 

అమరావతి :
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికారులని ఏర్పాట్లు చక చక చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరు మంగళవారం ఉదయం చంద్రబాబు నివాసంలో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీ ఎల్ఫీ లీడర్ గా చంద్రబాబును ఎన్నుకుంటారు. టీడీపీ ఎల్ఫీ లీడర్ గా ఎన్నుకున్న తరువాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అర్హత ఉంటుంది. భారీ మెజారితో గెలిచిన చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారని తెలుగుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest