వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

 

న్యూఢిల్లీ :

ఒకటో తేదీ ఊరట. గ్యాస్​ సిలిండర్ రేటును భారీగా తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్​ 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2.028కు చేరింది. తగ్గించిన ధరలు నేటి(శనివారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest