అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమే

 

అమరావతి:

తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?అని ఆయన ప్రశ్నించారు.

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

”తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది” అని పవన్‌ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest