అనంతపురంలో ఘనంగా శోభకృత్ నామ ఉగాది వేడుకలు

 

  • జిల్లా ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలి
  • అనంతపురం ఆర్డీవో మధుసూదన్ .

అనంతపురం,మార్చి,22:

జిల్లా ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని,ఆయురారోగ్యాలతో జీవించాలని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ ఆకాక్షించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలందరికి శ్రీశోభకృత్ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం నందు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశోభకృత్ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులచే భరతనాట్యం, కూచిపూడి ఇతర నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి

తొలుత వేద పండితులు నాగార్జున శర్మ, రఘోత్తమాచార్యులుపూజతో శ్రీశోభకృత్ నామ తెలుగు ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి.

అనంతపురం ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ, ఈ ఏడాది అంతా ఉద్యోగ, విద్యార్ధులు అన్ని రంగాల్లో రాణించి ఉద్యోగులు మంచి స్ధానాలకు చేరుకోవాలని విద్యార్ధులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటు న్నానన్నా రు. ఉగాది పచ్చడిలో ఉన్న సారాంశం ప్రకారం జీవితంలోని తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం, వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, భాదలు ప్రతీక అని అన్నింటిని సమపాళ్లలో మనం స్వీకరించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులంతా మరింత సమర్ధవంతంగా పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడాలన్నారు. అదే విధంగా విద్యార్దులందరూ చక్కగా చదువుకొని విజయాలందుకొని తమ తల్లిదండ్రులకు, తమ గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా పంపనూరు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిఆలయ ప్రధాన అర్చకులు నారావర్జుల సీతారామ మోహనశర్మ పంచాంగ శ్రవణం చేసారు. తొలుత ఉగాది పండుగ ప్రాధాన్యత విశిష్టతను తెలియజేశారు . ఈ సంవత్సరంలోని మంచి, చెడులను కందాయఫలాలను, ఆదాయ ఫలయాలను, రాశులవారీగా వివరించారు. తిధి, వార, నక్షత్రాదులు, లగ్నం, యోగకరణం, ఐదు అంగాలతో కూడినదే పంచాగం అని పేర్కొన్నారు. ఈ ఏడాది శుక్రుడు, శుభగ్రహాల ఆదిపత్యం వల్ల అత్యధిక శుభాలే జరుగుతాయన్నారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నారావర్జుల సీతారామ మోహనశర్మ,వేద పండితులు నాగార్జున శర్మ, రఘోత్తమా చార్యులను దుశ్శాలువలతో సత్కరించారు.

ఈ వేడుకలను పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల చేతులమీదుగా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, పెద్దపొలమడ గ్రామం, తాడిపత్రి మండలానికి చెందిన వేద పండితులు ఏ .పుల్లమాచార్యులు, గరుడ లేడు గ్రామం, కనేకల్ మండలానికి చెందిన శ్రీ బసవేశ్వర స్వామి దేవాలయం అర్చకులు జే.ఎం. మల్లికార్జున స్వామి, నార్పల గ్రామం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ అర్చకులు ఎన్.నరసింహయ్య లకు 10,116/- రూపాయల నగదు బహుమతితో పాటు, వస్త్రాలు, పండ్లు,ప్రశంసా పత్రములను అందచేసి వారిని శాలువాలతో సత్కరించారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు మెమెంటోలను అందించారు.వేదపండితుల ఆశీర్వచనాల మధ్యన అనంతపురము,కల్యాణ దుర్గం ఆర్డీఓలు,మధుసూదన్,ఏ.నిశాంత్ రెడ్డి,జెడ్పి సీఈఓ భాస్కర్ రెడ్డి, డిఆర్డీఏ,మెప్మా ,డ్వామా పీడీ లు నరసింహా రెడ్డి, విజయలక్ష్మి , వేణుగోపాల్ రెడ్డి,డిపిఓ ప్రభాకర రావు, జిల్లావెనక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి కుష్బూ కొఠారి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి లకు శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వర రెడ్డి,డి ఐ పి ఆర్ ఓ గురుస్వామి చెట్టి ,పర్యాటక శాఖ సిబ్బంది కిరణ్, దీపక్ , వివిధ శాఖల అధికారులు, విద్యార్ధినిలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest