అభివృద్ధిని పరుగులు పెట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యం

నాందేడ్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం  కేసీఆర్  వ్యాఖ్యలు

• అభివృద్ధిని పరుగులు పెట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యం

• సింగపూర్, జపాన్, మలేషియా తదితర దేశాల అభివృద్ధి గురించి వివరించిన సీఎం కేసీఆర్.
• గుణాత్మక అభివృద్ధి కోసం భిన్నమైన ఆలోచనతో, దేశ ఆలోచనా విధానాన్ని మార్చడం కోసమే బీఆర్ఎస్.

• ఈ దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు? ఈ దేశంలో అవసరానికి మించిన నదీజలాలున్నాయి.

• ఈ దేశంలో 1 లక్షా 40 వేల టీఎంసీల వర్షపాతం ఉంటుంది. అందులో 70 టీఎంసీలు ఆవిరైపోతుంది. దాదాపుగా 70 వేల టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

• కేంద్ర పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వవచ్చు. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి. ఇవి నా సొంత లెక్కలు కాదు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చినవే.

• కృష్ణా నీళ్లపై 2004లో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎందుకు పంపకాలు చేయలేదు?

• బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. నీటి వినియోగంలో విప్లవాత్మక ఎజెండాను అమలుచేస్తాం.

• ఈజిప్టు, కొలంబియా, అమెరికా, చైనా లాంటి దేశాల్లో అతిపెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి.

• మన దేశం కంటే చాలా చిన్న దేశమైనా జింబాంబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద దైన

రిజర్వాయర్ ఉంది. దీని సామర్థ్యం 6533 టిఎంసిలు. అదే విధంగా ఆఫ్రికాలో నైలు నది పై, రష్యాలో అంగారా నది పై, చైనాలో యాంగ్జే నదిపై, అమెరికాలో కొలరాడో నది పై 3000 నుండి 5000 టిఎంసిల రిజర్వాయర్లు రూపుదాల్చాయి.

• ఇంతటి సువిశాల భౌగోళిక స్వరూపం, పెద్దసంఖ్యలో జనాభా ఉండి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొనే ఈ దేశంలో కనీసం మూడు, నాలుగు రిజర్వాయర్లైనా ఉండకూడదా ? ఇంతటి విశాల భారతంలో కనీసం 2000 టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదు. దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది.

• ఇట్లాంటి అతిపెద్ద నీటి రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం భారత్ కు ఉంది. అందుకోసమే భిన్నంగా ఆలోచించాలని బీఆర్ఎస్ చెబుతున్నది.

• మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి?

• బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాల మధ్య కొట్లాటలు లేని జాతీయ నీటి విధానం తెస్తుంది

• అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు.

• దేశంలో 4 లక్షల 10 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్నది.

• అబద్ధాలు, ఉత్త మాటలు ఎన్ని విందాం.. ఇది మార్పుకు తగిన సమయం. మాతో కలిసి రండి.

• భారత్ లో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లు, అదే చైనాలో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 120 కిలోమీటర్లు. చైనాతో ఎప్పటికైనా పోటీపడగలమా?

• అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలోనూ గూడ్స్ రైళ్ల సగటు వేగం భారత్ కంటే ఎక్కువ. దేశంలోని ట్రక్ స్పీడ్ కూడా ఇతర దేశాల కంటే తక్కువ.

• ఇలాంటివి పట్టించుకోకుండా విభజన రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తే దేశం ఎలా ముందుకు పోతుంది.

• మన దేశంలో ఎన్ని పోర్టులున్నాయి? పెద్ద పెద్దవి ఎన్ని పోర్టులున్నయ్?

• మన ఎగుమతులు ఏమిటి? దిగుమతులు ఏమిటి?

• తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు

• భారతదేశంలో .. బిలియన్ టన్నుల బొగ్గు గనులు ఉన్నాయి. దాంట్లో 40 యాభై శాతాన్ని వాడినా కరెంట్ కోతలుండవు

• ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పవర్ సెక్టార్ ను జిందానీ లాంటి వారికి ఎందుకు కట్టబెడుతున్నారు.

• భారత ప్రజాస్వామ్య నాలుగో స్తంభం..మీడియా
• ప్రైవేట్ వాళ్లకు విద్యుత్ సంస్థను అప్పజెప్తే దేశాన్ని ఏం చేస్తారో చూస్తున్నాం. అదానీది ఏమైంది? దేశమే ప్రమాదంలో పడింది.

• అన్నీ ఉన్నట్టే ఉంటుంది కానీ దేశ ప్రజలకు ఏం అందదు

• పవర్ సెక్టార్ ప్రైవేట్ పరం చేస్తే.. మళ్లీ మేం వస్తే వాపస్ తీసుకుంటాం

• ప్రభుత్వానికి వచ్చిన ఎయిర్ ఇండియాను తిరిగి టాటాకు అప్పజెప్పిండు..

• బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పవర్ సెక్టార్ ను జాతీయం చేస్తాం.

• బీఆర్ఎస్ పాలసీని అనుసరిస్తే రెండేండ్లలో ఈ దేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది.

• దేశంలోని 90 శాతం విద్యుత్ సెక్టార్ ను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతాం. ఏమన్నా అంటే దేశం కోసం.. ధర్మం కోసం అంటారు?

• ఉన్న బొగ్గును ఉపయోగించుకోవడానికి చేతగాని కేంద్రం.. ప్రైవేట్ వాళ్ల నుంచి కొనుగోలు చేయాలని హుకుం చేస్తున్నది

• అదానీ మీద ఉన్న ప్రేమ దేశం మీద ఉంటే దేశం బాగుపడుతది..

• బొగ్గును దిగుమతి చేసుకోవడమంటే దేశ ప్రజలకు ద్రోహం చేయడమే

• కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు

• బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశంలో రెండేండ్లలోనే విద్యుత్ వెలుగులు

• దేశంలోని అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత ఉన్పప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది.

• భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మహిళల భాగస్వామ్యం అవసరం

• అన్ని రంగాల్లో మహిళలకు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత కల్పిస్తాం

• అన్ని రాష్ట్రాల చట్ట సభల్లో డీ లిమిటేషన్ ద్వారా 33% సీట్లు పెంచి వాటిని మహిళలకు రిజర్వ్ చేసి ఏడాది లోపు అమలు చేస్తాం.

• ఆర్నెల్లల్లో డీ లిమిటేషన్ చేసేసి, దేశంలోని ప్రజల భాగస్వామ్యాన్ని కూడా అన్ని రంగాల్లో ఆహ్వానిస్తాం.
• దేశంలో మూస పద్ధతి నడుస్తోంది.

• ఉత్తర భారతదేశంలో హథ్రాస్ లో మహిళల పరిస్థితి ఎలా ఉంది?

• మహిళల కోసం బీఆర్ఎస్ కొత్త విధానం తెస్తుంది.
• దేశం అభివృద్ధి చెందాలంటే దేశ ఆర్థిక విధానం మారాలి

• మేకిన్ ఇండియా ఎక్కడ బోయింది? జోకిన్ ఇండియా ఎందుకయ్యింది?

• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరళీకృతంగా ఉంటేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది.
• ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటారు గానీ ఉత్తర భారతదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.

• దీనికి సంబంధించిన పూర్తి పాలసీ డాక్యుమెంట్ తయారవుతున్నది

• అన్ని రంగాలలో సంపూర్ణ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది.

• మహారాష్ట్ర వంటి శక్తివంతమైన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది సిగ్గుపడాల్సిన అంశం.

• దీని కోసమేనా భగత్ సింగ్ వంటి మహనీయులు ఉరికంబం ఎక్కింది?

• ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ రంగం ఎల్ఐసి. ఎల్ఐసి ని ఆదానీకి అప్పగించడంలో నిజం లేదంటే పార్లమెంటులో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయడానికి ఎందుకు భయం?

• ఒక మామూల వ్యాపారి దునియాలో రెండో స్థానానికి ఎదగడం సాధ్యమేనా? ఆయన మీ మిత్రుడు కాబట్టే ఎదిగాడు.

• రాజకీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
• చైనా నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోతున్నప్పుడు వాటిని మన దేశానికి ఎందుకు మళ్లించలేకపోతున్నారు.

• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.

• పుట్టుకతో ఎవరూ జ్ఞానులు కారు.
• నాగలి పట్టే చేతులు శాసనాలు చేసే రోజులు రావాలి

• మహారాష్ట్రలో ఆత్మహత్యలకు బీజేపీనే కారణం
• బీఆర్ఎస్ అంటే ఒక పార్టీ కాదు.. ఒక మిషన్.
• మతం పేరుతో దేశ ప్రజల విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది.
• అందరం కలిసి అభివృద్ది చేసుకుందాం.

‘రీ ఇన్వెంటెడ్ ఇండియా – రీ ఓరియెంటెడ్ ఇండియా’ పేరుతో సీఎం కేసీఆర్ మీడియాకు డాక్యుమెంటు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest