అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు-రూట్ పునరుద్ధరణకు 36 గంటలు

విశాఖపట్నం

అల్లూరి సీతామరాజు జిల్లా లో గూడ్స్ బండి పట్టాలు తప్పింది. కిరండోల్, విశాఖపట్నం మారంగలోని శివలింగపూరం రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్ ఘడ్ లోని బచేలి నుంచి ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు శివలింగాపురం ఏడో టన్నెల్ వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది భోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో కొన్ని విద్యుత్ స్థంబాలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యలో కిరండోల్ విశాఖ వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. ఇప్పటికే టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు తిగిరి నగదు ఇచ్చేశారు. రైల్వే శాఖా ఉన్నతాధికారులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే రూట్ పునరుద్ధరణకు సుమారు 36 గంటలు పడుతుందని అధికారులు తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest