ఆనాడు ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు

అమరావతి:

”నేను 2004 పరిశ్రమల మంత్రి గా వున్నప్పుడు ఓక్స్ వ్యాగన్ విషయంలో నా పై దుమ్మెత్తి పోశారు. నేను ఆనాడు ఎంత బాధ పడ్డానో, క్షోభించానో నాకు తెలుసు” అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నాడు స్వయంగా మేమే సీబీఐ విచారణ కోరాం.
స్కిల్ డవేలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో భాగస్వాములు అయ్యారు.తప్పులు చేశారు కాబట్టి చంద్రబాబు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది.చంద్రబాబు ని హింసిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు బంది పోటు దొంగలు చేసిన దానికంటే పెద్ద నేరం చేశారు.చేసిన నేరానికి శిక్ష తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పై సమీక్షించుకుంటాం. ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగిందో సమీక్ష చేసుకుంటాం.చంద్రబాబు ప్రజలు ఎందుకు ఆదరిస్తారు.చంద్రబాబు చేసిన ఒక మంచి పని చెప్పండి.చంద్రబాబు దొంగ తనం, దోపిడీ పేటెంట్.స్కిల్ డవలెప్మెంట్ చంద్రబాబు పాత్ర ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారా? టీడీపీ ఎమ్మెల్యేలు ఆకాశం వైపు చూస్తున్నారా? ఎన్నికల తరువాత చూద్దాం అని బొత్స అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest