ఆర్టిసి బస్సు ఢీకొని కండక్టర్ మృతి

మంచిర్యాల

మంచిర్యాల బస్టాండ్‌లో బస్సు ఢీకొని ఆర్టీసీ కండక్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ గ్రామానికి చెందిన మృతుడు గంగారం డ్యూటీపై మంచిర్యాలకు వచ్చాడు.

అయితే.. త్రాగు నీటి కోసం బాటిల్ తీసుకొని డిపోలోకి వెళ్తున్న క్రమంలో మంచిర్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు TS 19 Z 0023 డిపోలోకి వెళ్తూ కండక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest