ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా వినయ్ కుమార్

హైదరాబాద్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా(ఇంటర్నేషనల్ కోఆపరేషన్) తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్. వినయ్ కుమార్

తెలంగాణ అటవీ శాఖలో సీనియర్ అధికారిగా ఉన్న డాక్టర్. వినయ్ కుమార్ కు ఉన్నత పదవిలో నియామకం అయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రూడూన్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా(ఇంటర్నేషనల్ కోఆపరేషన్) (ICFRE – Indian Council of Forestry Research and Education) వినయ్ కుమార్ నియమితులయ్యారు.

ఆయన ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖలో అదనపు పీసీసీఎఫ్ హోదాలో ఐటీ, వర్కింగ్ ప్లాన్ బాధ్యతల్లో ఉన్నారు. కొత్త పోస్టులో ఫారెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ పై అంతర్జాతీయ సంబంధాలను సమన్వయం చేయనున్నారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

వివిధ దేశాలకు చెందిన సంస్థల అటవీ అధ్యయనం, పరిశోధనలు, పర్యావరణ మార్పులపై జరిగే సదస్సులను వినయ్ కుమార్ పర్యవేక్షిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest