న్యూ ఢిల్లీ
ఇండియా -అమెరికా మధ్య జరిగిన పలు కీలక ఒప్పందంపై చైనా పెదవి విరిస్తోంది. ఇండియా -అమెరికా స్నేహబంధం ఎక్కువకాలం నిలబడని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నలాజి (ICET ) కి సంబంధించి ఇండియా -అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ మైత్రి ఎక్కువ కాలం నిలబడేది కాదని అంటోంది. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అమెరికా లో పర్యటించారు. ఐ సి ఈ టి కి సంబంధించి ఆయన అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Post Views: 120