ఇక అన్నీ పాన్ ఇండియా సినిమాలే?

ఏ మూహుర్తాన బాహుబలి సినిమా దేశ వ్యాప్తంగా హిట్ అయిందో కానీ ఆ సినిమాతో తెలుగు స్టార్స్ కు పాన్ ఇండియా పేరు వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. ఇప్పటిదాకా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాగా వచ్చినవి ముచ్చటగా మూడే సినిమాలు. తొలి పాన్ ఇండియా సినిమా బాహుబలి కాగా, రెండో పాన్ ఇండియా సినిమా పుష్ప, తరువాత ఆర్ ఆర్ ఆర్.
ఇప్పుడు తెలుగులో చేసే ప్రతి చిన్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఉదాహరణకు కార్తికేయ -2 సినిమా నార్త్ లో కాస్త బాగానే ఆడింది. దీంతో ఇక చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా అని మొదలు పెట్టారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా బి వి ఎస్ ఏం ప్రసాద్ నిర్మిస్తున్న ”విరూపాక్ష” అనే సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అంట. సాయి ధరమ్ తేజ్ కు తెలుగులోనే బ్లాక్స్ బస్టర్ హిట్ లేదు. అలాంటిది సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అసలు ఈ హీరో ఏయే సినిమాలు చేశాడో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ హీరోగారు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమాలోని పాత్రల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో నటించిన ముఖ్యమైన నటినటీలు కొందరు సినిమాలో వేసిన గెటప్ లోనే వేదిక మీదకు వచ్చి పరిచయం చేసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదం నుంచి కోలుకున్నాక చేసిన మొదటి సినిమా విరూపాక్ష. తెలుగులో ఈ పేరు జనానికి ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఇతర భాషల్లో ఈ టైటిల్ ఎలా ఎక్కుతుందో మరి. అయితే దర్శకుడు సుకుమార్ ఈ కథలో ఏలు పెట్టడం వల్ల ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా మారిందట. సాయి ధరమ్ తేజ మాట్లాడిన ఇరవై నిమిషాల్లో ఆయనను మరచిపోయాను…ఈయనను మరచి పోయాను అని చెప్పాడే తప్ప ఏది స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. బహుశా ప్రమాదం తరువాత మాట్లాడటంలో ఏదైనా సమస్య తలెత్తిందేమో . చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలే ఇంకా పాన్ ఇండియా సినిమా చెయ్యలేదు. అలాంటిది ఆడో అనుకోకుండా పుష్ప నార్త్ లో ఆడటం, బాహుబలిని బాగా నార్త్ ప్రజలు ఆదరించడం వల్ల తెలుగు సినిమాకు క్రేజీ ఏర్పడింది. అంతమాత్రాన ప్రతి చిన్న హీరో పాన్ ఇండియా సినిమా చేస్తానంటే నార్త్ ప్రజలు చూస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. అయితే పాన్ ఇండియా పేరుతో ఇంటర్ నెట్ రైట్స్ డిజిటల్ రైట్స్ అమ్ముకుని వ్యాపారం చెయ్యడానికి బాగానే ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest