ఈజీ మనీ కి అలవాటు పడి…డ్రగ్స్ సరఫరా

హైదరాబాద్

ఈజీ మనీ కి అలవాటు పడి ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని మాదాపూర్ ఎస్.ఓ.టి, కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లి లోని రంగదాముని చెరువు సమీపంలో డ్రగ్స్ సరఫరాతో పాటు కొనుగోలు చేస్తున్న పవన్ కుమార్(24) , హరి కృష్ణ(21), కిరణ్ తేజ(20), సాయి కుమార్(24) ,రఘు(23) అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నదిలా అలీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు వెల్లడించారు.

సాయి కుమార్ అనే వ్యక్తి బెంగళూరులో ప్రవేట్ ఉద్యోగం చేస్తూ నైజీరియన్ కి చెందిన వ్యక్తి దగ్గర నుండి డ్రగ్స్ తీసుకొని సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం సరఫరా చేస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 18 గ్రాములు ఎం.డీ.ఎం.ఏ డ్రగ్స్ తో పాటు నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసామని తెలియజేశారు. వాటి విలువ లక్ష రూపాయల ఉంటుందని డిసిపి వెల్లడించారు.

 

కూకట్పల్లిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

కూకట్ పల్లిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఎస్.ఓ.టి, కూకట్ పల్లి పోలీసులు జరిపిన సంయుక్త దాడుల్లో నిందితులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 18 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest