ఈ నెల 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న “మట్టికథ”

“Matti katha”, which is releasing in theaters on 22nd of this month, will win the hearts of the audience – Movie Team

Matti Katha starring Ajay Ved, Maya, Kanakavva, Dayanand Reddy and Balagam Sudhakar Reddy in lead roles has good buzz among audience. Appireddy is producing this film under Mic Movies banner. Co-Produced by Satish Manjeera. Directed by Pawan Kadiyala. The film Matti Katha has created history by winning awards in 9 international film festivals as well as awards in three categories at the Indo-French International Film Festival.

This movie is going to release in theaters on 22nd of this month. Ahead of the film’s release, a special preview press meet of Matti Katha was organized in Hyderabad. On this occasion,

Hero Ajay Ved said – I am very …
ఈ నెల 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న “మట్టికథ” ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది – మూవీ టీమ్

అజయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మట్టి కథ. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. సహనిర్మాత సతీశ్ మంజీర. పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మట్టి కథ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు కేటగిరీల్లో అవార్డులతో పాటు 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మట్టికథ సినిమా స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరో అజయ్ వేద్ మాట్లాడుతూ – మట్టి కథకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా వైరల్ అవుతోంది. చిన్నగా మొదలైన ఈ మూవీ..ఇప్పుడు థియేటర్స్ దాకా రావడం హ్యాపీగా ఉంది. మా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని ఊహించలేదు. ఈ నెల 22న రిలీజ్ కు వస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కొన్ని సెంటర్స్ ఫిల్ అవుతున్నాయని తెలిసింది. మైక్ మూవీస్ లాంటి పెద్ద సంస్థ మాకు సపోర్ట్ గా నిలవడం ఆనందంగా ఉంది. అప్పిరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మట్టి కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.

దర్శకుడు పవన్ కడియాల మాట్లాడుతూ – న్యూ మిలీనియం టైమ్ కి హైదరాబాద్ లో బాగా డెవలప్ మెంట్ మొదలైంది. ఆ టైమ్ లో నగరానికి సమీపంలో ఉన్న చిన్న ఊరి మీద ఈ డెవలప్ మెంట్ ప్రభావం ఎలా పడింది అనేది సహజంగా మట్టి కథలో చూపించాం. 2003 ఏడాదిలో ఈ కథ జరుగుతుంది. సహజమైన కథా కథనాలు క్యారెక్టర్స్ ఉంటాయి. మనకు పరిచయం ఉన్న ఊరిలో కథ జరిగిన ఫీలింగ్ కలుగుతుంది. మా మూవీని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపిస్తే 9 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మైక్ మూవీస్ అప్పిరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ నెల 22న థియేటర్స్ లో మట్టి కథ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అన్నారు.

యాక్ట్రెస్ రుచిత మాట్లాడుతూ – మట్టికథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు పవన్ గారికి థ్యాంక్స్. అంతా కొత్త వాళ్లం చేసిన ప్రయత్నమిది. మట్టి కథ చూస్తే కొత్త వాళ్లు చేసిన సినిమా ఇది అనిపించదు. మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమా అంతా న్యాచురల్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఎవరూ డిజప్పాయింట్ కారు. థియేటర్స్ లో చూడండి. మాలాంటి కొత్త వాళ్లకు ఎంకరేజ్ మెంట్ ఇచ్చినవాళ్లవుతారు. అని చెప్పింది.

నటుడు అక్షయ్ మాట్లాడుతూ – మట్టి కథలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పవన్ అన్నకు థ్యాంక్స్. ఇది మన నేటివ్ కథ. మన విలేజ్ లో జరిగిన ఫీలింగ్ ఇస్తుంది. కొత్త వాళ్లం చేసిన ప్రయత్నమిది. ఇవాళ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదే నమ్మకం మా అందరిలో ఉంది. అన్నారు.

యాక్టర్ రాజు ఆలూరి మాట్లాడుతూ – మట్టి కథతో మేము చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు ఎంకరేజ్ చేస్తే మా టీమ్ కు మరిన్ని మంచి సినిమాలు చేసే ఎనర్జీ వస్తుంది. అన్నారు.

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ – ఈ ఏడాది మా మైక్ మూవీస్ సంస్థలో వస్తున్న మూడో సినిమా మట్టి కథ. ఇలాంటి మూవీని నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఎన్నో కమర్షియల్ మూవీస్ చేస్తుంటాం. కానీ మట్టి కథ లాంటివి ఎంతో సంతృప్తినిస్తుంటాయి. 9 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న సినిమా ఇది. మా మైక్ మూవీస్ సీయీవో సతీష్ బ్యాక్ బోన్ లా ఉండి ఈ సినిమా చేశాడు. పవన్ కడియాల మన నేల కథ, మన నేటివ్ కథ రూపొందించాడు. ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే సినిమా మట్టికథ. అజయ్ వేద్ కు హీరోగా మంచి పేరొస్తుంది. అతను టాలెంటెడ్, కమిటెడ్ ఆర్టిస్ట్. అలాగే ఈ సినిమాలోని ఆర్టిస్టులు రుచిత, రాజు, అక్షయ్ అందరికీ మంచి కెరీర్ ఉంటుందని అనిపిస్తోంది. ఈ నెల 22న మట్టి కథ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నా. మీరంతా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – అజయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి, బల్వీర్ సింగ్, అక్షయ్, రాజు ఆలూరి, టీనా, రుచితా, సీతా మహాలక్ష్మి, నందగోపాల్ తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – స్మరణ్ సాయి

ఎడిటింగ్ – కుంభం ఉదయ్, రామ్ కృష్ణ

సినిమాటోగ్రఫీ- సాయి నాథ్

ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ – జీహెచ్ సుందర్

సాహిత్యం – నిహిలేష్ సుంకోజు

కో ప్రొడ్యూసర్ – సతీష్ మంజీర

ప్రొడ్యూసర్ – అప్పిరెడ్డి

పీఆర్వో – జీఎస్ కే మీడియా

రచన, దర్శకత్వం – పవన్ కడియాల

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest