ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం-ఆరోపణలపై ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ

అమరావతి :

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ వైసీపీ చెబుతోంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ వేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ వల్లే ఒక స్థానంలో ఓటమిపాలయ్యామని వైసీపీ చెబుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని వైసీపీ చెబుతోంది.
ఎమ్మెల్యేలు 23, ఓట్లు 23.. నెగిటివ్ నెంబర్‌ను లక్కీ నెంబర్‌గా మార్చుకున్న టీడీపీ

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని తేల్చి చెప్పారామె. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు.

”శ్రీదేవిని కొన్నాము అని టీడీపీ వాళ్లేమీ చెప్పడం లేదు. సొంత పార్టీ వాళ్లే నాపై ఆరోపణలు చేస్తున్నారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వారి తీరు ఉంది. వైసీపీలో అలాంటి పరిస్థితే ఉంది. నేనో డాక్టర్ ని. సూపర్ స్పెషలిస్ట్ ని. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు వచ్చాం. పదవులు మాకు ముఖ్యం కాదు. నా మీద ఇంచార్జ్ ని వేశారు. సెప్టెంబర్ లోనే నేను రిజైన్ చేయాలి లేదా గొడవ పెట్టుకోవాలి. కానీ, అలాంటిదేమీ చెయ్యలేదు.

వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

పార్టీకి, జగన్ కి లాయల్ గా ఉంటున్నా. ఉదయం కూడా జగన్ అన్నని కలిశాము. అన్నయ్య మాకు భరోసా ఇచ్చారు. మా అమ్మాయి కూడా ఢిల్లీలో మెడిసిన్ చదువుతోంది. బాగా చదువుకో, మా గవర్న్ మెంట్ లో నీకు మంచి పోస్ట్ కూడా ఇస్తాము. ఇంకా 30ఏళ్లు నేను రాజకీయాల్లో ఉంటాను అని జగన్ నా కూతురికి హామీ ఇచ్చారు. ఆయనకు నాకో పెద్దన్న లాంటి వారు. ఎప్పుడు వచ్చి ఏ సాయం అడిగినా చేస్తానన్నారు. సీఎం జగన్ అంత భరోసా ఇచ్చారు.

రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు .. వైసీపీకి షాకిచ్చిన గ్రాడ్యుయేట్లు
నేను క్రాస్ ఓటింగ్ వేసే దాన్ని అయితే అన్నయ్య జగన్ ను ఎందుకు కలుస్తాను? ఓటు వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలి కదా. కానీ, వెళ్లలేదు. చివరి వరకు ఉన్నా. కోలా గురువులు అనే ఎమ్మెల్సీ అభ్యర్థి కింద మేమున్నాం. అందుకే నాపై అనుమానాలు వస్తున్నాయి” అని ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest