ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఓ సాథియా అనే మూవీ రూపొందుతోంది. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ‘ఓ సాథియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. చిత్రంలో ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
జీ జాంబి సినిమాతో హీరోగా పరిచయమైన ఆర్యాన్ గౌర.. తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తాజాగా ఈ మూవీ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిపై ఘాడంగా ప్రేమిస్తున్న ప్రేమికుడి ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తున్నాయి. సాంగ్ టేకింగ్, పాటకు తగిన విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ పై వినోద్ కుమార్ (విన్ను) కట్టిన బాణీలు ఈ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ సాంగ్ లెవెల్ పెంచేశాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పాలనే ఈ పాటతో యూత్ కన్ను ఒక్కసారిగా ఓ సాథియా మూవీపై పడింది.
ఇప్పటికే ఓ సాథియా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షక ఆదరణ పొందగా.. ఇప్పుడు వదిలిన సాంగ్ అంచనాలు నెలకొల్పింది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
సాంకేతిక బృందం
దర్శకత్వం : దివ్య భావన
నిర్మాత : చందన కట్టా
లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ జూలూరు
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్: చంద్ర తివారీ ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్
బ్యానర్ : తన్విక జశ్విక క్రియేషన్స్
సంగీత దర్శకుడు : విన్ను
పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్
ఎడిటర్ : కార్తిక్ కట్స్
కెమెరామెన్ : ఈజే వేణు
పీఆర్వో : సాయి సతీష్
A Breezy Romantic Melody Nelamedha Lene From O Saathiya Unveiled
An upcoming film O Saathiya is a unique feel-good entertainer with a beautiful love story. An interesting aspect is that both the director and producer of this movie are women. Chandana Katta is producing ‘O Saathiya’ under Thanvika Jashwika Creations banner, while Divya Bhavna is directing it. Aryan Gowra and Mishti Chakravarty are the lead pair.
This is the second movie for Aryan Gowra who made an impressive debut with G- Zombie. Mishti Chakravarty plays his love interest in the movie. The movie has already completed its shooting part and in the last leg of post-production activities. As the movie is getting ready for its release makers have intensified the promotions. Freshly, they released a breezy romantic melody from the movie.
The song Nelamedha Lene connects instantly to the youth. The song depicts the feelings of the guy who is deeply and madly in love with the girl of his life. The visuals prove a feast for the eyes. Vinod Kumar (Vinnu)’s composition is very impressive, while Anantha Sriram’s lyrics are a big asset. The song was canned so authentically on the lead pair and with this one, the movie garnered the attention of the youth.
The promotional content of O Saathiya has already received a huge response, while the new song took the expectations to another level. EJ Venu’s cinematography seems to be a big plus for the film. The makers will announce the release date of this movie soon.
Director: Divya Bhavana
Producer: Chandana Katta
Banner: Thanvika Jashwika Creations
Cast: Aryan Gowra, Mishti Chakravarty
Line Producer: Vamshi Krishna Juluru
Executive Producers: Chandra Tiwari Avula, Keshav Sai Krishna Goud
Music Director: Vinnu
Lyricists: Bhaskarabhatla, Ananth Sriram, Rambabu Gosala
Choreographers: Raghu Master, Baba Bhaskar Master, Anee Master
Editor: Carthic Cuts
Dop: EJ Venu
PRO: Sai Satish
Post Views: 150