కల్వకుంట్ల కుటుంబం అబద్దాల కుటుంబం

సంగారెడ్డి

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అబద్దాల కుటుంబంగా మారిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్నారు బిజెపి రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అందుకోసం బూతు కమిటీ సభ్యుల పాత్ర కీలకమని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా చేస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు అంటే ఎంతో గౌరవం ఉండేదని అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు,‌ కేటీఆర్ అబద్ధాల మాటలతో గౌరవం పోయిందన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ నేడు కల్వకుంట్ల పాలైందన్నారు.
బూత్ కమిటీ అధ్యక్షునికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ అని, బూతు కమిటీ, ఏజెంట్లు ఎన్నికల్లో ఎంతో ప్రధానం అన్నారు. బీజేపీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నాయకులు గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఎడ్ల రమేష్, బూతు కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest