కాంగ్రెస్ లో చేరుతారా? గద్దర్ తర్జన భర్జన ?

 

  • గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గద్దర్

హైదరాబాద్ :
ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఈ మధ్య కాంగ్రెస్ నేతలతో తెగ తిరుగుతున్నారు. అప్పుడెప్పుడో ప్రధాని మోడీ సభకు హాజరైన గద్దర్ ఈ మధ్య కాంగ్రెస్ నేతలతో చెట్టా పట్టాలేసుకుని మరీ తిరుగుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలని గద్దర్ మనసులో అప్పటి నుంచో ఉన్నప్పటికి ఏ పార్టీలో జాయిన్ కావాలనే సందిగ్దమలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకానొక దశలో అమిత్ షా ను కలవాలని కూడా గద్దర్ ప్రయత్నాలు చేసినట్టు గూగుసలు విపించాయి. చిన జీయర్ స్వామి పెట్టిన రామానుజం విగ్రహం వద్ద పాటలు పాడిన గద్దర్ కు జనం నుంచి చేదు అనుభవం ఎదురైంది. చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో బీజేపీ వైపు చూడటం మానేశారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఎలాగో రానివ్వడు కాబట్టి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. గత ఎన్నికల సమయంలోనే మధు యాష్కీ దగ్గరుండి మరీ రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుని వెళ్లారు. గద్దర్ కొడుక్కి బెల్లంపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా అప్పట్లో బాగా జరిగింది. తరువాత ఏం అయిందో కానీ కాంగ్రెస్ బెల్లంపల్లి టికెట్ ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు మల్లి కాంగ్రెస్ టికెట్ అడిగేందుకు గద్దర్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదివారం గాంధీ భవన్ కు వెళ్లిన గద్దర్ అగ్ర కాంగ్రెస్ నేతలను కలవడం ఇలాంటి అనుమానాలను బలపరుస్తోంది. కాంగ్రెస్ గద్దర్ పట్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా ?లేక గద్దరే కాంగ్రెస్ పార్టీ పట్ల నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం.

 

గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని కలిసిన గద్దర్

రాహుల్ గాంధీ కి మద్దతు ఇవ్వడానికి వచ్చా :గద్దర్

ఈ నెల 19న రాహుల్ గాంధీ కర్ణాటక లోని కొల్హర్ మీటింగ్ కు వెళ్తా : గద్దర్

ఆ మీటింగ్ కు నన్ను తీసుకెళ్లమని రేవంత్ ను కోరా : గద్దర్

ఖచ్చితంగా తీసుకెళ్తా అని రేవంత్ మాటిచ్చాడు : గద్దర్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest