కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురికావొద్దు : హోమ్ మంత్రి

అమరావతి :

కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురికావద్దని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత భరోసా ఇచ్చారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి చెప్పారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా, సజావుగా జరిగాయని చెప్పారు.అభ్యర్థులు వారి ప్రతిభ, తెలివితేటలు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మి మోసుపోవద్దని హోంమంత్రి హెచ్చరించారు. సీఎం జగనన్న పాలనలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. సచివాలయ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.ఈవెంట్స్ లో చక్కగా రాణించి కానిస్టేబుల్ ఉద్యోగం పొందాలని అభ్యర్థులకు హోంమంత్రి తానేటి వనిత సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest