హైదరాబాద్ , ఫిబ్రవరి 24 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందంటూ బల్దియాకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. కుక్కలపై ఫిర్యాదు చెయ్యడానికి జనం బల్దియా కార్యాలయం ముందు క్యూ కడుతున్నారు. గడచిన 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు అందాయి. గంటకు 416 ఫిర్యాదులు వచ్చాయని జిహెచ్ఎంసి వెల్లడించింది. అంబర్ పెట్ లో బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన తరువాత బల్దియాకు కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
జిహెచ్ఎంసి లోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు 10 ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని బల్దియా అధికారులు చెప్తున్నారు. రోజుకు 300 ఫిర్యాదులు మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఐదు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేసేందుకు జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్ లో ఉన్నాయి.రోజు 150 ఆపరేషన్లు వరకు మాత్రమే చేయగలమని బల్దియా పేర్కొంటోంది.
Post Views: 131