కుక్క కాటు నివారణకు జిహెచ్ఎంసి హై లెవెల్ కమిటీ

 

హైదరాబాద్

నగరంలో వీధి కుక్కల నియంత్రణ కుక్క కాటు నివారణకు జిహెచ్ఎంసి లో హై లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని  పార్టీల కార్పొరేటర్ లతో పాటు కమిషనర్, డిప్యూటీ మేయర్, స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ కుక్కల నియంత్రణ, కుక్క కాటు ఇబ్బందులు లేకుండా చేయడానికి అంతే కాకుండా ఏ బి సి మానిటరింగ్ కమిటీ వేయాలని తీర్మానించారు. అతీర్మానం  మేరకు కుక్కల నియంత్రణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ హై లెవల్ కమిటీలో బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా , బిజెపి పార్టీ నుండి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మ , మల్కాజ్ గిరి కార్పొరేటర్ వి.శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ నుండి లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ ఎం.రజిత, ఏ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ నుండి పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్, లు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీకి కో-ఆర్డినేట్ ఆఫీసర్ గా డా.జె.డి విల్సన్ (డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరి) వ్యవహరిస్తారు.ఈ హై లెవల్ కమిటీ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎనిమల్ కేర్ సెంటర్లను పరిశీలించి అవసరమైన అభివృద్ధికి సూచనలు, సలహాలు నివేదిక అందజేస్తారని కమిషనర్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest