కులాల మధ్య చిచ్చు పెట్టాలని రామోజీరావు కుట్ర:ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

తాడేపల్లి.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్‌ ప్రెస్‌మీట్‌:

కులాల మధ్య చిచ్చు పెట్టాలని రామోజీరావు కుట్ర
మాల, మాదిగల మధ్య కూడా చిచ్చు పెట్టే కుయుక్తి
దళితులను వైయస్సార్‌సీపీకి దూరం చేయాలన్న లక్ష్యం
అందుకే రోజూ విషపు రాతలు. అదే పనిగా దుష్ప్రచారం
ఈనాడు రాతలపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

చంద్రబాబు హయాంలోనే దళితులకు అన్యాయం
వారిపై యథేచ్ఛగా దాడులు. అవమాన కార్యక్రమాలు
ఆ కాలంలోనే ఎస్సీ, ఎస్టీ కేసులు అత్యధికం
ఎన్‌సీబీ రికార్డుల్లోనే స్పష్టంగా ఆ వివరాలు
మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు
జగన్‌గారిపైనా అదే ముద్ర వేయాలన్న కుతంత్రం
అందుకే సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ
మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టీకరణ

ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసేలా రామోజీరావు వ్యవహారం
అది ఆక్షేపణీయం. అత్యంత దుర్మార్గం. అతి హేయం
పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై నిత్యం విషం
ఇప్పటికైనా మీ వైఖరి, పద్ధతి మార్చుకొండి
లేకపోతే మీ పత్రికకు, టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

తాడేపల్లి:

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏం మాట్లాడారంటే..:

కుట్రతో వాస్తవాల వక్రీకరణ:
ఈనాడులో దళితుల గురించి అదే పనిగా కథనాలు రాస్తున్నారు. దళితులు, ప్రభుత్వం మధ్య విభేదాల సృష్టించాలని చూస్తున్నారు. మా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా దళితుల కోసం చేసిందంతా వక్రీకరించి, వారికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చేలా కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రతిరోజూ విషపు రాతలు రాస్తున్నారు. ఈనాడు చంద్రబాబుకు ఒక కరపత్రం మాదిరిగా మారింది. దీన్ని ప్రజలూ గుర్తిస్తున్నారు.
రామోజీగారు టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలన్న కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకుంటే, చంద్రబాబు ఒక వీరుడు, శూరుడు, విక్రమార్కుడు అని రాసుకొండి. మాకేం అభ్యంతరం లేదు. అంతే కానీ, రోజూ మా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే ప్రజలే నీకు, నీ పత్రికకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ప్రజలంతా జగన్‌గారి వెంటే:
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇచ్చారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే దక్కే గౌరవం. సీఎంగారి భావజాలన, చిత్తశుద్ధి, పథకాలు, కార్యక్రమాల అమలు వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే వారంతా ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా అంతులేని ప్రేమ, ఆప్యాయత చూపుతున్నారు. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.

రామోజీ ‘చిచ్చు’ కుట్ర:
అందుకే ఎలాగైనా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. 17 శాతం ఉన్న ఎస్సీలు, 6 శాతం ఉన్న ఎస్టీలు.. ఇద్దరూ కలిపి 23 శాతం. వారికి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చూసి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రధాన వర్గాలైన మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు, దళితులను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేయాలన్న కుట్ర చేస్తున్నారు.
ఇవాళ రామోజీరావుకు ఒకటే చెబుతున్నాం. దళితులపై ఎప్పుడైనా దాడులు జరిగాయంటే, వారికి అన్యాయం జరిగిందంటే అది కేవలం చంద్రబాబు హయాంలోనే. ఇంకా ఎస్సీ కమిషన్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ పదవిలో ఉన్న వ్యక్తి, మొత్తం రాజకీయాలు చేశారు. కానీ ఇవాళ ఆ పదవిలో ఉన్న విక్టర్‌ ప్రసాద్‌ ఉన్నారు. ఆయన నీతి, నిజాయితీకి మారుపేరు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా వెళ్తున్నారు. ఎవరి తప్పున్నా సరే, ఉపేక్షించడం లేదు. ఎక్కడైనా పోలీసుల తప్పుంటే, వారిపైనా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దిశలోనే పోలీసులను సస్పెండ్‌ చేయడం జరిగింది.

జగన్‌గారిపైనా అదే ముద్రకు యత్నం:
చంద్రబాబు గురించి రాయడానికి ఏమి లేదని రామోజీరావుకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు దుష్ట బుద్ది, రాజకీయ జీవితంలో ఆయన చేసిన మోసాలు, చిట్టా అంతా రామోజీ దగ్గర ఉంది కాబట్టి.. చంద్రబాబు మంచోడని రామోజీ రాయడానికి ఏమి లేదు కాబట్టి.. చంద్రబాబు మంచోడని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి.. జగన్‌గారు కూడా మంచోడు కాదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు.

‘మార్గదర్శి’ కోసం..:
దళిత సామాజిక వర్గానికి ప్రభుత్వానికి మధ్య ఒక అగాథం ఉందని భ్రమ కల్పించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి అసలు కారణాలు ప్రజలకు తెలియాలి.
మార్గదర్శి చిట్‌ఫండ్‌ చందాదారుల సొమ్ముతో దందా చేసి, డబ్బును పక్క దారి పట్టించి వారి కష్టార్జితాన్ని మీ లాభాపేక్షకు వాడుకుని స్కామ్‌కు పాల్పడిన నేపథ్యంలో సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు (29వ తేదీ), రేపు (30వ తేదీ), ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో విచారణకు రావాలని కోరారు. అందుకే ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా మరింత విషం చిమ్మే కార్యక్రమానికి తెర లేపారు. పత్రికా విలువలను తుంగలో తొక్కి బరి తెగించి అసత్య కథనాలు రాస్తున్నారు.

అప్పుడే కేసులు ఎక్కువ:
చంద్రబాబు హయాంలో ఎస్సీలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు 2016లో 2,335 కేసులు, 2017లో 1969 కేసులు నమోదయ్యాయి. అంటే ఏటా సగటున 2,103 కేసులు నమోదయ్యాయి
అదే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–2021 వరకు సగటున 2011 కేసులు నమోదయ్యాయి. 2021లో 2014 కేసులు నమెదయ్యాయని నేషనల్‌ క్రై మ్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రికార్డు చెబుతోంది.
ఇక ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 361 కేసులు నమోదయ్యాయి. అంటే టీడీపీ హయాంలో ఏటా సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులు నమోదు కాగా, 2019–2021 వరకు ఏటా సగటున 337 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఎన్‌సీబీ రికార్డుల్లో ఉన్నాయి. దీని వల్ల ఎవరి హయాంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయన్న విషయం స్పష్టమవుతుంది.

ఇప్పుడు పరిహారం ఎక్కువ:
టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల సంఖ్య ఎక్కువ ఉండగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారికి మరింత న్యాయం జరుగుతోంది.
అదెలా అంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 వరకు వారికి రూ.52.32 కోట్ల పరిహారం ఇవ్వగా, మా ప్రభుత్వ హయాంలో, 2019–22 మధ్య మూడేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు రూ.125 కోట్ల పరిహారం అందించారు.

ప్రజలు మిమ్మల్ని నమ్మబోరు:
మీ పత్రిక గత నాలుగేళ్లగా దిగజారుడు రాతలు రాస్తూ పత్రిక విలువలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా వదిలేసిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దళితులపై దమనకాండ అంటూ రాయడానికి కారణం ఏంటి? దళితుల్ని భుజాన వేసుకున్నామని మీరు చెప్పే ప్రయత్నం, వారి కోసం పాటు పడుతున్నామన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
దళితుల భూమి లాక్కుని, రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మించిన మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర ప్రజలు అంత నిరాక్షరాస్యులు కాదు.

వ్యూహాత్మకంగా దుష్ప్రచారం:
ముందు రోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదని లోకేష్‌ మాట్లాడితే వెంటనే మీరు దానికి సంబంధించి వార్త పతాక శీర్షికలో రాస్తారు. ఆ వెంటనే దుష్ట చతుష్టయం ఎల్లో మీడియాలో చర్చ పెడుతుంది. వాటిలో ఏయే పెయిడ్‌ ఆర్టిస్టులు పాల్గొంటారో అందరికి తెలుసు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతోంది.

దురుద్దేశంతో దుష్ప్రచారం:
ఇక్కడ ఒకటే విషయం. చంద్రబాబు హయాంలో గరగపర్రు నుంచి జెర్రిపోతులపాలెం వరకు జరిగిన ఘటనలు రామోజీరావుకు ఎందుకు గుర్తు లేవు?. వాటి గురించి ఎందుకు రాయడం లేదు? దళితులగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని అన్న చంద్రబాబు, దానిమీద కనీసం క్షమాపణ కూడా కోరలేదు.
చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్‌గారు కూడా మంచివారు కాదని ప్రచారం చేసే కుట్ర. అందుకే విషపు రాతలు. దుష్ప్రచారం.

దళితులంటే బాబుకు కోపం:
చంద్రబాబుకు ఏనాడూ దళితులపై ప్రేమ లేదు. నిరుపేదలు, దళితులకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే. దాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లాడు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని దానిపైనా కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దన్నారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఒక రాజ్యాంగ నిపుణుడిని నియమిస్తే దానిపైనా కోర్టును ఆశ్రయించాడు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం వద్దంటూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నాడు.
ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వారు మురికివాడల్లో ఉంటారన్న వారిని మంత్రివర్గంలో కొనసాగించాడు. చుండూరు, కారంచేడు ఘటనలకు బాధ్యులు ఎవరన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏనాడూ ఎస్సీల కోసం సబ్‌ ప్లాన్‌ అమలు చేయలేదు. ఆయనకు తెలిసిందల్లా దోచుకోవడమే.

వైఖరి మార్చుకోకపోతే..:
అచ్చెన్న హత్య బాధాకరం. అది దురదృష్టకర ఘటన. ఈరోజు సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ. కేవలం ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసే విధంగా రామోజీరావు వ్యవహరించడం ఆక్షేపణీయం. దుర్మార్గం. పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇది సరి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొండి. లేదు మేము మారం. తెలుగుదేశం పార్టీ కోసమే రాస్తామని అనుకుంటే, మీ పత్రికకు, తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెబుతారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

టీడీపీ స్క్రిప్ట్‌ శ్రీదేవి నోట:
అక్కడ దళిత ఎమ్మెల్యే అన్నది కాదు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా పని చేయడం అన్నది చూడాలి. పార్టీ నాయకత్వాన్ని బలహీనపర్చే విధంగా ఎవరు ప్రవర్తించినా, వాకు కచ్చితంగా క్రమశిక్షణకు బాధ్యులవుతారు. ఎమ్మెల్యే శ్రీదేవి నిజంగా క్రాస్‌ ఓటింగ్‌ చేయకపోతే, మర్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇక్కడే ప్రెస్‌మీట్‌ ఎందుకు నిర్వహించలేదు. హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? అమరావతి అంశాన్ని భుజానికి ఎందుకు ఎత్తుకున్నారు? అంటే ఆమె తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌ను చదివారు.

దృష్టి మళ్లించే కుట్రలు:
ఈరోజు చూడండి. రామోజీరావుకు మార్గదర్శి కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వగానే దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, విషపు రాతలు రాస్తున్నారు. అలా అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో అసెంబ్లీలో ఒకసారి ఇలాగే 2017–18లో అసెంబ్లీలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌పై చర్చ జరగకుండా.. కావాలని అంబేడ్కర్‌ 125వ జయంతి విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా దళితులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అవసరం తీరాక వారిని వదిలేయడం చంద్రబాబుకు, రామోజీరావుకు అలవాటు. ఇప్పుడు శ్రీదేవితోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest