- జంతర్ మంతర్ దగ్గర TJS మౌన దీక్ష
- ప్రజల తరపున మాట్లాడకపోవడం సిగ్గుచేటు
- తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న KCR
- విభజన అంశాలను పట్టించుకోని BRS
న్యూ ఢిల్లీ :
తెలంగాణ జన సమితి(TJS) అధ్యక్షుడు ప్రో. కోందండరాం కేసీఆర్ (KCR) పై యుద్ధం ప్రకటించారు. కృష్ణ జలాల వాటితో పాటు విభజన అంశాలను పట్టించుకున్న పాపాన పోలేదని కోదండరాం మండి పడుతున్నారు. కృష్ణ జలాల వాటా కోసం టి జె ఎస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టింది. కోదండరాం(kodandaram) తో సహా ఆ పార్టీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. విభజన అంశాల్లో పేర్కొన్న తెలంగాణ హక్కులను సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమైయ్యారని కోదండరాం దుయ్యబట్టారు. అరవై శాతంలో కేవలం 32 శాతం మాత్రమే తెలంగాణకు కేటాయించారని చెప్పారు. ఈ అన్యాయాన్ని పరిష్కరించాల్సిన కేంద్రం ఇటీవల తెచ్చిన గజిట్ తో తెలంగాణ కు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా బి ఆర్ ఎస్ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాలు జరుగొద్దని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అయితే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం లో బి ఆర్ ఎస్ పూర్తిగా విఫలమైందని, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం టి జె ఎస్ మరో ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పారు. బి ఆర్ ఎస్ (BRS) నాయకులు సొంత వ్యాపారాల కోసం ఢిల్లీ కి చార్టెడ్ ప్లైట్ లో వస్తారు,రాష్ట్ర ప్రజల తరుపున మాత్రం మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వాలు విభజన అంశాలను పరిష్కారం చేయడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఇప్పుడు వచ్చే పార్లమెంటు సమావేశాలలో బి అర్.ఎస్ యం.పి లు చర్చ పెట్టాలన్నారు. రాబోయో రోజుల లో కలిసి వచ్చే పార్టీలతో మరో ఉద్యమ తీవ్రం చేస్తామని అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రజల తరుపున మరో పోరాటం చేస్తామని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. విభజన హామీలను తుంగలో తొక్కి,పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లో విపలమయ్యారు. పదవి వ్యామోహంతో ఉద్యమకారులను మర్చిపోయి, BRS పార్టీ పేరుతో రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో KCRకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, కుంట్ల ధర్మజున్, బైరి రమేష్, నిజ్జన రమేష్ ముదిరాజ్,మొగుడం పల్లి ఆశప్ప, రైతు విభాగం రాష్ట్ర నాయకులు కంతి మోహన్ రెడ్డి, మారబోయిన శ్రీధర్,యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ సలీం పాషా,విద్యార్థి జనసమితి నాయకులు సర్దార్ వినోద్, అరుణ్ కుమార్,మహిళా వింగ్ నాయకురాలు R లక్ష్మి,ఆంజనేయులు, లక్ష్మణ్ యాదవ్, మాంద్ర మల్లయ్య,తుల్జారెడ్డి,జావేద్,ఏలిషాల రాజేష్ , ప్రకాష్ గౌడ్,ఖాదర్ పాశ,రాం చందర్ నారబోయిన కిరణ్, పుష్పనీల తదితరులు పాల్గొన్నారు.