కె. విశ్వనాధ్ ఇక లేరు

 

  • సోమయాజులుకు శంకరాభరణం
  •  కమలహాసన్ తో సాగర సంగమం
  •  చిరంజీవితో స్వయంకృషి
  •  సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా బిజీ
  •  నాలుగు తరాలతో పని చేసిన అనుభవం
  •  కళాతపస్విగా సుపరిచయం
  •  1992 లో పద్మశ్రీ అవార్డు
  • 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  •  5 జాతీయ అవార్డులు -5 నంది అవార్డులు
  • 10 ఫిలిం ఫేర్ అవార్డులు

హైదరాబాద్

కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇక లేరు. 92 ఏళ్ళు ఉన్న కాశీనాథుని విశ్వనాధ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 19 ఫిబ్రవరి 1939లో విశ్వనాధ్ జన్మించారు. ”ఆత్మ గౌరవం” సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా కె. విశ్వనాధ్ అనేక కళాఖండాలను రూపొందించారు. మద్రాసులోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డర్ గా కెరీర్ ప్రారంభించారు. తరువాత దర్శకుడిగా మారారు. స్వాతిముత్యం, శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వయంకృషి, శుభలేఖ, శుభా సంకల్పం, స్వర్ణాభిషేకం, శారదా, నేరము శిక్ష వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వనాధ్ చివరి సారిగా దర్శకత్వం వహించిన సినిమా శుభ్రప్రదం .
దర్శకుడిగా అద్భుతమైన కళా ఖండాలు రూపొందించిన విశ్వనాధ్ తన రెండవ ఇన్నింగ్స్ లో నటుడిగా బిజీ అయ్యారు. బాలకృష్ణ , వెంకటేష్, ప్రభాస్ లాంటి స్టార్ హోరోలకు తండ్రిగా, తాతగా నటించారు. 1992 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. 2016 లో సినిమా రంగంలోనే అత్యుత్తమ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో విశ్వనాధ్ ను సత్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నంది వార్డులతో పాటు పలు ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు.

వరుస విషాదాలు….
2023 వ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు విషాదాంతంగా ప్రారంభమైంది. జనవరి లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జామున చనిపోయింది. గురువారం ఉదయం చెన్నై లో దర్శకుడు సాగర్ చనిపోయారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో కళాతపస్వి కె విశ్వనాధ్ కన్నుమూశారు. వీరందరూ కూడా వయసు మీదపడటంతో పాటు వివిధ రకాల అనారోగ్యం చెయ్యడం వల్ల కూడా చనిపోయారు. తెలుగు చిత్ర సీమ విషాదవదనంతో కన్నీరు మున్నీరవుతోంది. 2022 చివరలో సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ కూడా చనిపోయారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest