కేంద్ర ఒంటెద్దు పోకడ- బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ లేనే లేవు

కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్స్…
—————————————–

✓ కేంద్ర బడ్జెట్ ఆచరణ సాధ్యం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి

✓ రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు బడ్జెట్ సత్ ఫలితాలు ఎలా వస్తాయి.

✓ దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా లేవు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి.

✓. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఒకే రకమైన స్కీం ను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఇది ఆచరణ యోగ్యం కాని ప్రయోగం.

✓ ఒకే దేశం, ఒకే చట్టం అని, డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్ర ప్రభుత్వం ఏవేవో ఆలోచనలు చేస్తోంది

✓ రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోంది

✓ కేంద్ర బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ లేనే లేవు

✓ ఏ రంగాన్ని కూడా మేలు చేయని ఘోరమైన కేంద్ర బడ్జెట్ ఇది

✓ కేంద్ర జనరల్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కలపడంతో అంతా గందరగోళం నెలకొంది

✓ కేంద్ర బడ్జెట్ లో అన్ని పద్దుల్లో రైల్వే పద్దు ఒకటిగా మారిపోయింది

✓ కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే… తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు

✓ ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని కేంద్ర బడ్జెట్ లో చెప్తున్నారు. నర్సింగ్ కాలేజీలలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుంది

✓ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్కో దానికి రూ. 400 కోట్లు ఇవ్వాలి

✓ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నా దాని ఊసే లేకుండా పోయింది

✓ రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. చాతకాని తనంపై బిజెపి ఎం.పీ. లు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అడుగు పెట్టే నైతిక హక్కు బిజెపి రాష్ట్ర నలుగురు ఎం.పీ.లు కోల్పోయారు.

✓ ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీకి నిధుల మంజూరు, శంకుస్థాపన గుర్తుకు వస్తాయి. ఇలా గుజరాత్ ఒక్క రాష్ట్రానికే ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేశారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 5,300 కోట్ల రూపాయల నిధులను నరేంద్ర మోడీ మంజూరు చేశారు.

✓ దేశంలోని బ్యాంకులను ముంచిన బడా బాబులను విదేశాల నుంచి రప్పిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ… వారు విదేశాల్లో జల్సాలు చేస్తున్నా పట్టించుకోకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్నారు.

✓ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఒక్కటి కూడా నిజం కాలేదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest