గిల్డ్ చేతుల్లోకి కౌన్సిల్-అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్ విజయం

  • ఈసీ మెంబర్స్ గా దిల్ రాజు, స్రవంతి రవికిశోర్, డివివి దానయ్య, ఠాగూర్ మధు
  • ఉపాధ్యక్ష పదవుల్లో అశోక్ కుమార్, సుప్రియ ,
  • కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవం

హైదరాబాద్, ఫిబ్రవరి 19 :

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షకుడిగా దామోదర్ ప్రసాద్ విజయం సాధించారు. ప్రత్యర్థి జెమిని కిరణ్ పై 24 ఓట్ల తేడాతో దామోదర్ ప్రసాద్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో నిర్మాతల మండలి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేతులోకి వచ్చేసింది. ఇదే ప్యానల్ నుంచి దిల్ రాజు, స్రవంతి రవికిశోర్, డివివి దానయ్య, ఠాగూర్ మధు లాంటి అగ్ర నిర్మాతలు గెలుపొందారు. ఇప్పటికే రెండు ఉపాధ్యక్ష పదవుల్లో అశోక్ కుమార్, సుప్రియ , కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కబడ్డారు. మిగిలిన ప్రెసిడెంట్, సెక్రెటరీస్, జాయింట్ సెక్రెటరీస్, ఈసీ మెంబర్స్ కు ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఫిలిం నగర్ లో జరిగిన హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో గిల్డ్ సభ్యులు మద్దతు తెలిపిన ప్యానల్ నుంచి పది మంది ఈసీ మెంబర్స్ గెలవగా, గిల్డ్ ను వ్యతిరేకించిన ప్యానల్ నుంచి అయిదు గురు ఈసీ మెంబర్స్ ఎన్నికయ్యారు. మొత్తం పదిహేను మంది ఈసీ మెంబర్స్ ఉంటారు. అధ్యక్ష పదవితో పాటు పది మంది ఈసీ మెంబర్స్ గెలవడం తో తెలుగు నిర్మాతల మండలి ఇప్పుడు గిల్డ్ చేతుల్లోకి వెళ్ళిపోయిందనే విషయం స్పష్టమవుతోంది. గిల్డ్ ప్యానెల్ ను గెలిపించుకునేందుకు దిల్ రాజు , స్రవంతి రవి కోశోర్ బాగానే కష్టపడ్డారని చెప్పవచ్చు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్నికలు జరిగాయి.

గిల్డ్ మూసెయ్యాల్సిందే: సి. కళ్యాణ్
ప్రొడ్యూసర్స్ కొందరు పెట్టుకున్న గిల్డ్ ను మూసెయ్యాల్సిందేనని సి. కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించిన సందర్బంగా మీడియాతో మాట్లాడారు. గిల్డ్ ను మూసేస్తామని ఈ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే గిల్డ్ ను మూసెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే గిల్డ్ మూసేసేవరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు.

నిర్మాతల క్షేమం కోసమే పని చేస్తా : దామోదర్ ప్రసాద్
తెలుగు చలన చిత్ర నిర్మాతల సంక్షేమం కోసమే తాను పని చేస్తానని కొత్తగా గెలిచిన నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ అన్నారు. ఈ పదవిలో గెలిపించిన నిర్మాతలందరికి కృతజ్ఞ్యతలు అని చెప్పారు. గిల్డ్ ను నిర్మాతల మండలిలో కలుపుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వనప్పటికీ , గిల్డ్ లో ఉన్న ఇక్కడ ఉన్న ఎందరో మన నిర్మాతలే కాబట్టి ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అన్ని సమస్యలను గుర్తిస్తామని , పరిష్కారం కోసం మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు.

ఐక్యంగా ముందుకు వెళ్తాము : ప్రతాని రామకృష్ణ గౌడ్
కౌన్సిల్ డెవెలప్మెంట్ చెయ్యాలనే మంచి ఆలోచనతో ఉన్నాం. అయితే రెండు కలిసి పోతే బాగుంటుంది. కౌన్సిల్ లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెల్త్ కార్డ్స్ అయిదు లక్షల వరకు చెయ్యాలనేది కూడా జనరల్ బడి సమావేశంలో చర్చిండం జరిగింది. దీన్ని రెండు ప్యానల్స్ కూడా అంగీకరించాయి కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. వెల్ఫేర్ సకీమ్స్ కంటిన్యూ కావాలనేది మా ఆలోచన. నిర్మాతలకు మంచి జరిగే విధంగా నేను కూడా నా శాయశక్తులా సపోర్ట్ చేస్తా. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఫ్రీ గా సినిమా చెయ్యడానికి హీరోలు ముందుకు వస్తే చాలా సంతోషం.

ఈసీ మీటింగ్ లో అన్ని విషయాలు చర్చిస్తా: నట్టి కుమార్
ఇండిపెండెంట్ గా నిలబడి జాయింట్ సెక్రెటరీగా నన్ను గెలిపించినందుకు నిర్మాతలదరికి కృతజ్ఞ్యతలు అని నట్టి కుమార్ అన్నారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే గిల్డ్ , నిర్మాతల మండలి కలిసిపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందరం కలిసి నిర్మాతల బాగుకోసం కృషి చేస్తాం.

గెలిచిన కమిటీ ఇదే !

ప్రెసిడెంట్ గా దామోదర్ ప్రసాద్
ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, సుప్రియ,
సెక్రెటరీలుగా ప్రసన్న కుమార్ , వై వి ఎస్ చౌదరి
జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్
కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ
ఈసీ మెంబర్లుగా
దిల్ రాజు, స్రవంతి రవి కిషోర్, డీవీవీ దానయ్య, ఠాగూర్ మధు, అభిషేక్ అగర్వాల్, తోట కృష్ణ, పద్మిని,రవి శంకర్, సురేందర్ రెడ్డి, బెక్కెం వేణుగోపాల్ ,
ఆచంట గోపినాథ్, ప్రతాని రామకృష్ణ గౌడ్ , వీఎం కిషోర్ పూసల,వజ్జా శ్రీనివాస్ రావు, కేశవ్ రావు పల్లి,

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest