గ్యాస్ ధరలు పెంచినందుకు మహిళా కాంగ్రెస్ నిరసన

 

హైదరాబాద్
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నాయకత్వంలో సిలెండర్ ను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాములో గ్యాస్ ధర ఎంత ఉండే? మోడీ హయాంలో గ్యాస్ ధర ఎంత పెరిగింది? వంటి పోస్టర్లను ప్రదర్శించారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest