గ్రీస్ రైలు ప్రమాద-30మందికి పైగా మృతి -85మందికి గాయాలు

ఏథెన్స్(గ్రీస్) :
గ్రీస్ లో రెండు రైలు ఢీకొన్న ఘటనలో సుమారు 32మంది చనిపోయారు. 85 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. మంగళవారం అర్థరాత్రి మధ్య గ్రీస్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఏథెన్స్ నుంచి ఉత్తర నగరం థెస్స లోని కికి వైపుకు ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ రైలు, థెస్స నుంచి లారిస్సా కార్గో రైలు సెంట్రల్ గ్రీస్ లోని లారిస్సా లో ఢీకొన్నాయి. రెండు రైళ్లు బలంగా గుద్దుకోవడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయని స్థానిక అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సందర్బంగా చెలరేగిన మంటలను ఆర్పేందుకు 17 ఫైర్ ఇంజన్లు పని చేశాయని అగ్ని మాపక శాఖా అధికారులు వెల్లడించారు. మంటలను అదుపులో తెచ్చామని అన్నారు. అయితే ఈ రెండు రైలు ప్రమాదం వెనుక కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. నాలుగు డబ్బాలు పూర్తిగా పట్టాలు తప్పాయని అక్కడి గవర్నర్ అఘోరాస్టస్ తెలిపారు. గాయపడిన వారిలో సుమారు 25 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest