గ్రూపు-1 ఫలితాల్లో నమ్మలేని నిజాలు:బండి సంజయ్‌

హైదరాబాద్‌ :

టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీకు వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా గ్రూపు-1 ఫలితాలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బండి సంజయ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘గ్రూపు-1లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. గ్రూపు-1లో బీఆర్‌ఎస్‌ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అవడమే కాకుండా ఒక చిన్ని గ్రామంలో ఆరు క్వాలిఫై అయ్యారు. దీనికి మంత్రి కేటీఆరే బాధ్యులు. కేసీఆర్‌ నియమించిన సిట్‌ విచారణ ఎలా చేయగలదు? సిట్టింగ్‌ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest