ఘనంగా ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

 

 

విశాఖపట్నం , మార్చి 03 : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో ఘనంగా ప్రాంరంభమైంది. లేజర్ షో, మా తెలుగు తల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సమ్మిట్‍కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, జీఎం రావు, సజ్జన్ జిందాల్ తదితర వ్యాపార దిగ్గజాలు హాజరైయ్యారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి రజని , ఎంపీ విజయ్ సాయి రెడ్డి కలిసి ముఖేష్ అంబానీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఎంవోయూల్లో 90 శాతం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సత్వరమే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూములు అందజేస్తామన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest