ఘనంగా TTA మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ట్రైబల్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. హిమాయత్ నగర్ లోని సేంట్ పీటర్స్ హై స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఖైరతాబాద్ ఐ ఓ ఎస్ డాక్టర్ శాంత రాథోడ్ హాజరైయ్యారు. జీపీఆర్ సంస్థ ఎండీ అండ్ చైర్మన్ జీ. ప్రవీణ కుమారి గౌరవ అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా పలువురు టీచర్స్ ను ఘనంగా సన్మానించారు. సాహసోపేతమైన పనిని చేసిన టీచర్ రాధను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.

ఈ సందర్బంగా ప్రవీణ కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా పుట్టిందో చాలా చక్కగా వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె కోరారు. విద్య, ఉద్యోగ రంగాలతో పాటు వ్యాపార రంగాల్లో కూడా మహిళలు రాణించాలని చెప్పారు. సమాజం బాగుపడాలంటే మహిళల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. మహిళలకు ఆర్ధిక స్వాలంబన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీచర్ రాధా చేసిన సాహసోపేతమైన పనితో తాను ఎంతగానో గర్వపడుతున్నానని అన్నారు. రాధా టీచర్ తన మనసుకు హత్తుకునే పని చేశారని ఆమె పేర్కొన్నారు.


ఖైరతాబాద్ ఐ ఓ ఎస్ డాక్టర్ శాంత రాథోడ్ మాట్లాడుతూ ప్రతి మహిళా రాధా టీచర్ లాగే ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలు భయపడితే ముందుకు వెళ్లలేమని అన్నారు. మహిళా ముందడుగు వేస్తే ఏ పనినైనా సక్సెస్ ఫుల్ గా చేస్తుందని ఆమె తెలిపారు.


ఈ కార్యక్రమంలో ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (TTA ) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఏ. రాధాబాయి, ప్రసాద్ బాబు, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు నవనీత, హైదరాబాద్ జిల్లా కోశాధికారి లీల తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest