చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి-నాగార్జున కూడా హాజరు

 

  • పవన్ కళ్యాణ్ గురించి చర్చ
  •  తెలుగు సినిమా అభివృద్ధి గురించి వాకబు

హైదరాబాద్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చాడు. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి కేంద్రమంత్రిని సన్మానించారు. ఇంతకీ చిరంజీవి ఇంటికి బీజేపీకి చెందిన మంత్రి రావడమేంటి? రాజకీయాలకు దూరంగా ఉండే నాగార్జున అక్కినేని చిరంజీవి ఇంటికి వెళ్లి కేంద్రమంత్రిని సన్మానించడం ఏమిటి? అనేది విశ్లేషకుల్లా మదిలో వెయ్యి డాలర్ల ప్రశ్నలు మెదులుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పత్తి, బీజేపీ పార్టీ కలిసి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవిని కేంద్ర మంత్రి కలిసిన సందర్భంగా జనసేన గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి పైన కూడా చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు నేషనల్ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిరంజీవిని నియమిస్తారా? అనే ప్రచారం కూడా బాగానే జరుగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest