ఛత్తీస్ ఘడ్ లో 90 స్థానాల్లో ఏపీఐ పోటీకి సిద్ధం

ఛత్తీస్ ఘడ్ :

ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీతో పాటు అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా (API ) కూడా పోటీకి సిద్ధమంటోంది. ఛత్తీస్ ఘడ్ లోని 90 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు విజయ్ మాన్కర్ ప్రస్తుతం చత్తిస్ ఘడ్ లో పర్యటిస్తున్నారు. బస్టర్ జిల్లాలోని కొండగావ్ లో విజయ్ పర్యటించారు. 2023 లో జరిగే ఎన్నికల ప్రచారాన్ని తాము ప్రారంభిస్తున్నామని ఈ సందర్బంగా విజయ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేశాయని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనే సుమారు 200 స్థానాల్లో తమ పార్టీ పోటీకి దిగుతుందని ఆయన పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest