గుంటూరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అస్సలు వీడే పరిస్థితే లేదని, తన పై జరుగు
తుంది తప్పుడు ప్రచారం మాత్రమేనని మాజీ హోంశాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు మేకతోటి సుచరిత
కొట్టి పారేశారు. బ్రాడీపేటలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం సుచరిత మాట్లాడా
రు. కొందరు వ్యక్తులు వారి ఊహలకి అందిన విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాన్ని ఆధారంగా చేసుకొని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయని అన్నారు.పార్టీ మారాల్సి వస్తే గృహిణి గా మాత్రమే ఉంటానే తప్పా వేరే పార్టీలైతే మారనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కులం, మతం ప్రాంతాలు చూడకుండా పథకాలు అందిస్తున్నారని, అటువంటి నాయకుడి వెంటే తన ప్రయాణం సాగుతుందని అన్నారు. ప్రజల మంచి కోరుకునే పార్టీలకి ప్రజాక్షేత్రంలో కూడా మంచే జరుగుతుందని,ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ 175/175 సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే… ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం తమ పార్టీ అధిష్టానానికి లేదని, అధిష్ఠానం అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. రాజకీయంగా ఎవరో అణచివేస్తే అణచివేయబడరు కానీ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది.